చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిళ్లలో కూడా చాలా మంది డబ్బులు పెడతారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి వాటిల్లో డబ్బులు పెట్టడం ముఖ్యం. కరోనా తర్వాత చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోవడం జరుగుతోంది.
ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలు వున్నాయి. ఇవి బాగా హెల్ప్ అవుతాయి. వీటిని పోస్టల్ శాఖ తీసుకు వచ్చింది. మరి ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. రూ.299 లేదా రూ.399 ప్రీమియం ని ఒక ఏడాది కడితే రూ.10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లించే రెండు వేర్వేరు పాలసీలని అందిస్తోంది పోస్ట్ ఆఫీస్. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి.
రూ.399 ప్రీమియం పాలసీ:
రూ.399 ప్రీమియం పాలసీ గురించి చూస్తే.. పది రకాల లాభాలని మనం దీనితో పొందొచ్చు.
ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా, అంగ ఛేదం జరిగినా కూడ రూ.10 లక్షల వరకు వస్తాయి.
పిల్లలకు చదువుల నిమిత్తం రూ.లక్ష పరిహారం వస్తుంది.
అంత్యక్రియల కోసం రూ.5 వేలు కూడా వస్తాయి.
గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే రూ.60 వేలు ఇస్తారు.
ఓపీడీ గా ట్రీట్మెంట్ తీసుకుంటే రోజుకి వెయ్యి ఇస్తారు.
ఆస్పత్రిలో 10 రోజుల వరకు డబ్బులు చెల్లిస్తారు. ప్రతిరోజు రూ.1000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
రవాణా ఖర్చుల కి అయితే రూ.25వేలు మించకుండా ఇస్తారు.
రూ.299 ప్రీమియం పాలసీ:
శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, ఒకవేళ పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల వరకు పొందొచ్చు.
ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు.
ఓపీడీగా చికిత్స తీసుకొంటే రూ.30వేలు.