మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఆ డబ్బు తో మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి రాబడి వస్తుంది.
పైగా ఈ స్కీమ్ లో కనుక మీరు డబ్బులు పెట్టారంటే ఆ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..ఈ స్కీమ్ వ్యవధి వచ్చేసి 124 నెలలు. అంటే 10 సంవత్సరాల 4 నెలలు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ లో మీరు కనీసం రూ. 1,000 పెట్టుబడిని పెట్టచ్చు. ఎంతైనా ఇందులో పెట్టచ్చు.
ఇక ఈ స్కీమ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది చూస్తే.. రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే పాన్ కార్డు అవసరం. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఐటీఆర్, వేతన స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు కూడా కావాలి. అలానే ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభించదు.
మెచ్యూరిటీపై మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్రాన్ని తాకట్టుగా లేదా సెక్యూరిటీగా ఉంచితే లోన్ కూడా వస్తుంది. ఇందులో రూ.1000, రూ.5000, రూ.10000, రూ.50000 ఇలా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఇలా మీ డబ్బులను రెట్టింపు చేసుకోవచ్చు.