పోస్టాఫీస్ స్కీమ్స్(Post Office Schemes) తో చాలా ప్రయోజనాలు పొందొచ్చు. ఎన్నో రకాల స్కీమ్స్ ని పోస్టాఫీస్ ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఏ రిస్క్ కూడా ఉండదు. పైగా అదిరిపోయే లాభాలు మనం పొందొచ్చు. అయితే పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వుంది. దీని వలన అదిరిపోయే లాభాలు పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
పోస్టాఫీస్ స్కీమ్స్ వలన చాలా లాభాలు వున్నాయి. అయితే మీరు ఎంచుకునే స్కీమ్ ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి స్కీమ్ ఎంచుకునే ముందే జాగ్రత్తగా ఉండాలి గమనించండి. ప్రతి నెలా కొంత డబ్బులు చెల్లించాలని భావిస్తే..
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇందులో చేరితే నిర్ణీత కాలం వరకు డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి. మెచ్యూరిటీ కాలం తర్వాత ఒకేసారి డబ్బులు మీకు వస్తాయి.
దీనిలో కచ్చితమైన లాభం వస్తుంది. పైగా ఏ రిస్క్ ఉండదు. అయితే ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు నెలకు రూ.2 వేలు డిపాజిట్ చెయ్యాలని అనుకుంటే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.1.40 లక్షలు లభిస్తాయి. మీరు ఐదేళ్ల వరకు డబ్బులు కడుతూ వెళ్లాలి అంతే.
అయితే ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన వారు ఐదేళ్ల వరకు కూడా రూ.2 వేలు కడుతూ ఉంటే అప్పుడు మీరు మొత్తంగా రూ.1.2 లక్షలు చెల్లించినట్లు అవుతుంది.
మీకు రూ.20 వేల వరకు వడ్డీ రూపంలో వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఎక్కువ డబ్బులు కడితే అప్పుడు మీకు మరెంత ఎక్కువ రాబడి వస్తుంది.