బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరిక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. హైకోర్ట్ సూచనతో పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో పదో తరగతి ఇంటర్ పరిక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడంతో తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలగా ముందుకు వెళ్ళింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసారు. ఇక హైకోర్ట్ లో విచారణ జరగగా అన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేసినా మీరు ఎలా నిర్వహిస్తారని కుదిరితే పరీక్షలను వాయిదా వేసుకోవాలని సూచించింది.