PRABHAS : ”సలార్” మూవీ నుంచి వీడియో లీక్..

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగoదూర్ నిన్ను చూస్తున్న ఈ సినిమాకు రవి బసృత్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ నుంచి ప్రభాస్‌ లుక్‌ లీక్‌ అయింది. అలాగే.. ఈ సినిమా షూటింగ్‌ నుంచి ఓ వీడియో లీక్‌ అయి.. వైరల్‌ గా మారింది. వీడియోలో ప్రభాస్‌ కనిపించకపోయినా… లీకైన ఫోటోలో ప్రభాస్‌ స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోను బట్టి చూస్తే.. ఏదో ఫైట్‌ సీన్‌ లా కనిపిస్తోంది. కాగా.. సలార్‌ సినిమా రెండు భాగాల్లో రిలీజ్‌ అవుతుందని.. రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version