1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
A. 2005, మే 25
B. 2005, మే 24
C. 2005, మే 22
D. 2005, మే 20
2. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది?
A. 2005, డిసెంబర్ 25
B. 2005, డిసెంబర్ 24
C. 2005, డిసెంబర్ 23
D. 2005, డిసెంబర్ 20
3. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
A. 2005, మే 25
B. 2005, మే 24
C. 2005, మే 20
D. 2005, మే 30
4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ) ఏ సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది?
A. 2006, సెప్టెంబర్ 24
B. 2006, సెప్టెంబర్ 25
C. 2006, సెప్టెంబర్ 27
D. 2006, సెప్టెంబర్ 26
5. విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
A. నివారణ
B. సంసిద్ధత
C. ఉపశమనం
D. పైవన్నీ
6. విపత్తు సంభవించిన తర్వాత తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
A. పునరావాసం
B. పునర్నిర్మాణం
C. ఉపశమనం
D. పైవన్నీ
7. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
A. 7
B. 8
C. 9
D. 10
8. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
A. 39
B. 9
C. 41
D. 42
9. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
A. వ్యవసాయ మంత్రిత్వశాఖ
B. గృహ నిర్వహణ మంత్రిత్వశాఖ
C. రక్షణ మంత్రిత్వశాఖ
D. ప్రధాన మంత్రి
10. ఏ సంవత్సరంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థగా మార్పు చెందింది?
ఎ. 2003, అక్టోబర్ 13
బి. 2003, అక్టోబర్ 14
సి. 2003, అక్టోబర్ 15
డి. 2003, అక్టోబర్ 16
జవాబులు:
1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు: D. 2005, మే 20
అభివృద్ధి చెందిన దేశాలు అమలుపరుస్తున్న కార్యక్రమాలు, ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 2005, మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టం చేసింది.
2. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది?
జవాబు: C. 2005, డిసెంబర్ 23
2005, డిసెంబర్ 23 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది.
3. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
జవాబు: D. 2005, మే 30
ఎన్‌ఎండీఏను 2005, మే 30న ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఒక కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేశారు.
4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ) ఏ సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది?
జవాబు: C. 2006, సెప్టెంబర్ 27
2006, సెప్టెంబర్ 27న ప్రధాన మంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా అమలులోకి వచ్చింది.
5. విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
జవాబు: D. పైవన్నీ
నివారణ, సంసిద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
6. విపత్తు సంభవించిన తర్వాత తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
జవాబు: D. పైవన్నీ
పునరావాసం, పునర్నిర్మాణం, ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
7. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ఎండీఏ)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
జవాబు: C. 9
ప్రధాన మంత్రి అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఎన్‌ఎండీఏ ఏర్పాటైంది.
8. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
జవాబు: D. 42
కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎన్‌ఐడీఎంలో 42 మంది సభ్యులు ఉంటారు
9. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
జవాబు: B. గృహ నిర్వహణ మంత్రిత్వశాఖ
ఎన్‌ఐడీఎం హోంమంత్రిత్వాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. హోంమంత్రిత్వశాఖనే గృహ నిర్వహణ మంత్రిత్వశాఖ
10. ఏ సంవత్సరంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థగా మార్పు చెందింది?
జవాబు: C. 2003, అక్టోబర్ 15
2003, అక్టోబర్ 14న ఎన్‌ఐడీఎంగా మార్పు చెందింది.