ప్రైవేట్ పార్టీలో మరోసారి రెచ్చిపోయిన ప్రగతి…మోడ్రన్ డ్రెస్సులో స్టిల్స్

-

ఎంజాయ్‌మెంట్‌కు వయసు అడ్డు కాదు అని నటి ప్రగతి చెప్పకనే చెప్తోంది. వెండితెరపైన సంప్రదాయ బద్ధమైన పాత్రలకు ప్రాణం పోసే ఈ సీనియర్ నటి..బయట మాత్రం తనకు నచ్చినట్లు ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో కనబడుతూ వావ్ అనిపిస్తుంటుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతీ మ్యాటర్ షేర్ చేస్తుంటుంది. ఇటీవల హీరోయిన్ తమన్నా భాటియా లాగా జిమ్ లో డాన్స్ చేస్తూ ఉన్న వీడియో షేర్ చేసింది. తాజాగా మరోసారి మీడియాలో హైలైట్ అయింది ఈ నటి.

నలుపు రంగు స్లీవ్ లెస్ టైట్ షార్ట్ టాప్‌లో అందాలన్నీ ఆరబోస్తూ ప్రైవేట్ పార్టీ‌లో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

46 ఏళ్ల వయసులోనూ నటి ప్రగతి..పదహారు ఏళ్ల పడుచు పిల్లలా మారిందంటూ ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రగతి నటించిన F3 మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో తమన్నా భాటియా, మెహ్రీన్ లకు మదర్‌గా నటించింది.

https://www.instagram.com/p/CdYoVgJvS4m/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news