బాబు ‘కుప్పం’ కష్టాలు.. 2024లో క్లారిటీ?

-

2019 ఎన్నికల ముందు వరకు కుప్పం నియోజకవర్గం గురించి పెద్ద చర్చ లేదు..ప్రతి ఎన్నికలో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారు..మంచి మెజారిటీతో గెలుస్తారు…ఇంకా అంతే మళ్ళీ కుప్పం గురించి వార్తలు ఉండవు..అయితే 2019 ఎన్నికల నుంచి కుప్పం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది..దానికి కారణం జగన్ వేవ్..2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కుప్పంలో చంద్రబాబు సైతం కాస్త గెలుపు కోసం కాస్త పోరాడాల్సి వచ్చింది..సరే ఎలాగైతే చివరికి కుప్పంలో బాబు గెలిచారు.

సరే అంతటితో కుప్పం గురించి చర్చ లేకుండా పోయిందా? అంటే అబ్బే అక్కడ నుంచే కుప్పం గురించి చర్చ మొదలైంది…వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కుప్పంలో చంద్రబాబుని దెబ్బకొట్టడమే లక్ష్యంగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. కుప్పం ఎలాగో బాబు కంచుకోట కాబట్టి..అక్కడ ఫలితాలు టీడీపీకి అనుకూలంగానే ఉంటాయని అనుకున్నారు…పోనీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి..కాస్త వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు.

కానీ అలా జరగలేదు…వార్ వన్ సైడ్ అన్నట్లు కుప్పంలో పోరు జరిగింది…పంచాయితీ, పరిషత్…ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ వన్ సైడ్ గా గెలుచుకుంది..ఇక్కడ టీడీపీ దారుణమైన ఓటమిని చవిచూసింది..దీంతో నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి గ్యారెంటీ అంటూ వైసీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడటం పక్కన పెడితే…కాస్త గెలుపుపై చంద్రబాబుకు గాని, టీడీపీ నేతల్లో గాని భయం వచ్చింది.

అందుకే ఎప్పుడు పెద్దగా కుప్పంపై ఫోకస్ చేయని బాబు…ఇప్పుడు వరుసపెట్టి కుప్పం పర్యటనలు చేస్తున్నారు. అసలు ఎన్నికల ప్రచారానికే వెళ్లని బాబు…ఇప్పుడు ఖాళీ సమయంలో కూడా కుప్పంలో వాలిపోతున్నారు…ఇప్పటికే పలుమార్లు కుప్పంలో పర్యటించారు..మళ్ళీ ఇప్పుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. అంటే కుప్పంలో బాబుకు ఎన్ని కష్టాలు వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు..అయితే ఈ కష్టాలు తీరతాయో లేదో 2024 ఎన్నికల్లో క్లారిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news