Prashanth Neel: ఆయన సినిమాల్లో హీరో ఎలివేషన్ నెక్స్ట్ లెవల్..చిరంజీవిపై ప్రశాంత్ నీల్ కామెంట్స్

-

ఒకే ఒక చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు దర్శకులు ప్రశాంత్ నీల్. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ ఫిల్మ్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణకు నోచుకుంది. ఈ పిక్చర్ చాప్టర్ 2 ఈ నెల 14న విడుదల కానుంది ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్ 2’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను విశేషంగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా తన సినిమా జర్నీ, తనపై ప్రభావాలు గురించి వివరిస్తూనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిత్ర సీమలో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూడో చిత్రమే. శ్రీమురళి హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉగ్రమ్’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో, డైరెక్టర్.. ఆ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. అలా ప్రశాంత్ నీల్ – శ్రీమురళి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ యశ్ తో కేజీఎఫ్ ఫిల్మ్ చేశారు. ఇకపోతే ఆయన సినిమాల్లో హీరోల ఎలివేషన్స్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడారు.

తనకు టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని, ఆయనే తనకు ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్పిరేషన్ అని తెలిపిన ప్రశాంత్ నీల్.. చిరు సినిమాలు చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాలు చూస్తు పెరిగిన తనకు ఆయన సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అనిపించాయన్నారు.

మాస్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, అందుకు కారణం చిరంజీవియేనని, తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని అన్నారు. శ్రీమురళి ‘భగీర’ చిత్రానికి మాటలు అందిస్తున్న ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తీస్తున్నారు. ఆ చిత్రం ‘సలార్’. కాగా, కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ పిక్చర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తు్న్నారు ప్రశాంత్ నీల్.

Read more RELATED
Recommended to you

Latest news