స్టిల్ ఫొటోగ్రాఫర్‌ను డీఓపీ చేసిన ప్రశాంత్ నీల్..హ్యాట్సాఫ్ KGF2 డైరెక్టర్

-

KGF2 మేనియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనబడుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తూనే ఉన్నాయి. సినీ ప్రముఖులు, విమర్శకులు పిక్చర్ గురించి తమ ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నారు. గురువారం విడుదలైన ఈ మూవీ ఒకే రోజు దేశవ్యాప్తంగా రూ.134 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

 

ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభను ప్రతీ ఒక్కరు తెగపొగిడేస్తున్నారు. RRR సినిమాతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే అన్న భావనను క్రియేట్ చేయగా, దానిని కొనసాగించే దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటూ ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. ఇకపోతే KGF2 మూవీ సినిమాటోగ్రఫీ, విజ్యువల్స్ గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.

ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్. నిజానికి భువన్ స్టిల్ ఫొటోగ్రాఫర్ అని, అతనికి సినిమాటోగ్రాఫర్ గా అనగా సినిమాకు డీఓపీగా అవకాశం ఇచ్చింది ప్రశాంత్ నీలేనన్న విషయం యశ్ ఇంటర్వ్యూలో చెప్పారు. KGF2 ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు యాంకర్ సుమకు ఈ విషయం తెలిపారు హీరో యశ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. టాలెంట్ ను గుర్తించడంలో ప్రశాంత్ నీల్ ముందుంటారని, ఆయనే భువన్ గౌడ్ ను గుర్తించారని చెప్పుకొచ్చారు.

 

 

బడ్జెట్ లోనే మూవీ చేయడంతో పాటు నాణ్యత రావడం కోసం ప్రశాంత్ నీలా చాలా కష్టపడ్డారని హీరో యశ్ వివరించాడు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తన తొలి చిత్రం ‘ఉగ్రమ్’కు స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పని చేసిన భువన్ గౌడలో చురుకుతునం చూసి తాను సినిమాటోగ్రాఫర్ గా మార్చానన్నాడు. అలా ఇక భువన్ గౌడ్ ..ప్రశాంత్ నీల్ ఆస్థాన డీఓపీ అయిపోయారు.

KGF Chapter 2 First Look
KGF Chapter 2 First Look

ప్రశాంత్ నీల్ చేయబోయే ప్రభాస్ ‘సలార్’ సినిమాకు కూడా భువన్ గౌడ్ డీఓపీగా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రశాంత్ నీల్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. టాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేయడంలో ప్రశాంత్ నీల్ ముందుంటారని పేర్కొంటున్నారు. కేజీఎఫ్ 2 ఫిల్మ్ కు ఎడిటర్ గా 20 ఏళ్ల కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి వర్క్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news