త్వరలో అఖిల్ తో సినిమా తీస్తా – నాగార్జున

-

త్వరలో అఖిల్ తో సినిమా తీస్తానని ప్రకటించారు నాగ్. నిన్న కర్నూల్‌ లో ఘోస్ట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఈవెంట్‌ లో నాగార్జున ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నారంటే మా నాన్న అక్కినేని నాగేశ్వర రావు అని… మీ అభిమానం చూడడానికి చైతూని ఇక్కడికి తీసుకువచ్చానని తెలిపారు.

అక్టోబర్ 5న 34 ఏళ్ల క్రితం శివ సినిమా వచ్చింది….అప్పుడు చైన్ పట్టుకొని వచ్చా…ఇప్పుడు కత్తితో ముందుకు వస్తున్నాన్నారు. విజయ దశమి ఘోస్ట్ కి విజయం ఇస్తుందనుకుంటున్నా..ఈ సినిమాలో షూటిం టైం లో హీరో ఇన్ సోనాల్ కి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు.

గతంలో చైతుతో బంగార్రాజు సినిమా చేసా….త్వరలో అఖిల్ తో సినిమా తీస్తానన్నారు. గతంలో అన్నయ్య సినిమాకి కర్నూలుకు వచ్చానని.. ఘోస్ట్ సినిమా కోసం చాలా కష్టపడ్డామని వివరించారు. యాక్షన్, థ్రిల్లర్ సినిమా ఘోస్ట్ అని వెల్లడించారు. విజయదశమి రోజున ఘోస్ట్ సినిమా విడుదల కానుందని.. అదేరోజు చిరంజీవి సినిమా విడుదల, రెండు సినిమాలు విజవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news