Preity Zinta : కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా !

-

బాలీవుడ్‌ స్టార్‌ నటి ప్రీతి జింటా ఓ శుభవార్త చెప్పింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనించింది ప్రతీ జింటా. సరో గసి… ( అద్దె గర్భం ) ద్వారా ఆమె ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా స్పష్టం చేసింది. తన భర్త జీన్‌ తో కలిసి దిగిన ఓ ఫోటో ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే.. ఈ సంతోష కరమైన వార్తను అందరితో పాలు పంచుకుంది ప్రీతి జింటా.

అలాగే తన పిల్లలకు జై జింటా, గియా జింటా పేర్లు కూడా ఫైనల్‌ చేసింది ప్రీతి జింటా. ”అందరికీ నమస్కారం, నేను ఈ రోజు మా అద్భుతమైన వార్తలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్ & నేను చాలా సంతోషిస్తున్నాము & మా కవలలు జై జింటా & గియా జింటా లు ఇద్దరు మా కుటుంబంలోకి వచ్చారు. ఈ విషయం చాలా సంతోషంగా ఉంది. ఈ సరోగసి ప్రక్రియ లో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి స్పెషల్‌ థ్యాంక్స్‌” అంటూ ప్రీతి జింటా ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version