ఏపీ వాహనదారులకు షాక్‌..ఆ ఛార్జీలు భారీగా పెంపు

-

ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణ శాఖ కసరత్తు చేస్తోంది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు.. కనిష్టంగా రూ. 5 వేల వరకు ప్రతిపాదించింది ఏపీ రవాణ శాఖ. ఏడాది కాలానికి రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ. 2 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 1 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందని నోటిఫికేషన్‌ లో పేర్కొంది.

వివిధ ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేల మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్దారణ చేసింది. ఒకరికంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రేట్ల ఆధారంగా వేలం వేయనున్నారు రవాణ శాఖ అధికారులు. ఈ మేరకు చట్ట సవరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన 15 రోజుల్లోగా అభ్యంతరాలేమైనా ఉంటే తెలపాలని పేర్కొంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version