శ్రీలంక దేశంలో దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశం నుండి పారిపోయాడు అధ్యక్షుడు రాజపక్సే. మిలటరీ విమానంలో మాల్దీవులకు వెళ్ళి తలదాచుకున్న రాజపక్సే.. దక్షిణాసియా నుంచి పారిపోయిన 2వ అధ్యక్షుడుగా మిగిలాడు. గతంలో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం ఇస్లామిక్ కంట్రికే పరారీ అయ్యాడు.
మొత్తం 15 మంది కుటుంబ సభ్యులతో దేశం వదిలన రాజపక్సే..నలుగురు అన్నదమ్ములు…కొడుకు నికల్ సహా మొత్తం పరారీ అయ్యారు. దీంతో శ్రీలంకను కనుసైగ శాసించిన రాజపక్సే కుటుంబం పాలనాకు చెక్ పెట్టినట్లైంది. ప్రజా ఆగ్రహానికి దేశం వదిలి పరారీ అయ్యాడు రాజపక్సే. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు కాగా.. అందరి కంటే పెద్ద వాడు చామల్ రాజపక్స.
మహేంద రాజపక్స అధ్యక్షునిగా వ్యవహరించిన కాలంలో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. చామల్ తర్వాతి వాడు మహేంద రాజపక్సే రెండుసార్లు అధ్యక్షుడు కాగా…ఓసారి ప్రధాని అయ్యాడు. మూడో వాడు ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. నాలుగో వాడు బాసిల్ రాజపక్స. ప్రస్తుతం ఇతను కూడా గొటబాయకు రైట్ బ్యాండ్ కావడం విశేషయం.