మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్

-

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో లోక్ సభ ఇండిపెండెంట్ ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే గుండాయిజాన్ని అంతం చేయాలని ఆమె అన్నారు. మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఉద్దవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కోరారు.

బాల్ థాక్రే సిద్ధాంతాలను అనుసరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రెబల్ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులకు హాని కలిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల థాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా పటించేందుకు నవనీత్ కౌర్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను, ఆమె భర్తను అరెస్టు చేశారు. ఇద్దరు కూడా కొన్ని రోజులు రిమాండ్ లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news