ఎమ్మెల్యే సంజయ్: ప్రియాంక అందాన్ని చూసి ఎంపీ సీటు ఇచ్చారు !

-

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయన్నది ఊహించలేని విధంగా ఉంది. తాజాగా ఉద్దవ్ వర్గంలోని శివసేన వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది గురించి షిండే వర్గం కు చెందిన ఎమ్మెల్యే సంజయ్ బర్సాత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. సంజయ్ బర్సాత్ మాట్లాడుతూ ప్రియాంక చతుర్వేది అందాన్ని చూసి ఆమెకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చాడని ఆదిత్య ఠాక్రే ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని అందరికీ తెలుసు.. దానితో షిండే వర్గంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆదిత్య ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు.. ఆదిత్య మాట్లాడుతూ.. ఈయన మాటలు చూస్తుంటే ఎంత వక్రబుద్ధి కలిగిన వారన్నది స్పష్టంగా అర్ధమవుతోంది అన్నారు. ఇటువంటి వారికి రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారని హెచ్చరించారు. ఇక రాజ్యసభ ఎంపీగా ఉన్న ప్రియాంక చతుర్వేది సైతం సంజయ్ వ్యాఖ్యలపై మహిళలను మరింత దిగజార్చేలా ఈయన కామెంట్స్ ఉన్నాయంటూ అసహనానికి గురయ్యారు.

కాగా సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ముందు ముందు ఏమైనా పార్టీని డామేజ్ చేస్తాయా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version