కోమటి రెడ్డి వెంటక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటాం – కాంగ్రెస్

-

కోమటి రెడ్డి వెంటక్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కోమటి రెడ్డి వెంటక్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, దానిపై అతను వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు జై రాం రమేష్. లక్షణ రేఖ దాటితే, చర్యలు తప్పవని హెచ్చరికులు కూడా జారీ చేశారు జై రాం రమేష్. మునుగోడు లో జరిగింది మద్యం, మని ఎన్నికలు అని.. గెలిచింది మద్యం, మని అన్నారు.

ప్రజాస్వామ్య న్నీ కూని చేశారని… పాల్వాయి స్రవంతి గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తని వెల్లడించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య స్రవంతి పోటీ చేశారని… 200 కోట్ల మద్యం తాగించారని ఆగ్రహించారు. భారత్ జోడో యాత్ర కి దీనికి సంబంధం లేదు.. మునుగోడు లో ఎం జరిగింది అనేది సమీక్ష చేస్తామన్నారు జై రాం రమేష్. టీఆరెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ నేనని.. కొత్త ఉత్సాహం తో కొత్త శక్తి తో కాంగ్రెస్ దూసుకొస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version