వీటికి బలం చేకూర్చేవిధంగా రాష్ట్రాలకు కేంద్రం విధిస్తున్న ఆంక్షలు తోడుగా నిలుస్తున్నాయి. కాస్త సవరణలు చేస్తే సడలింపులు ఇస్తే బొగ్గు కొనుగోళ్లు కూడా సులువు అవుతాయి. కానీ మోడీ సర్కారు కేవలం ఓ వైపే చూస్తూ ఓ వైపు కొమ్ము కాస్తూ ఉంటోందన్నది ఓ వర్గం ఆరోపణ.
రాష్ట్రాలు ఓ విధంగా విద్యుత్ పరంగా కష్టాలు పడుతున్నాయి. బొగ్గు కొనుగోళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాయి. అదేవిధంగా వద్దన్నా స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న యోచన ఒకటి తప్పుగానే ఉంది. వ్యవసాయ మోటార్లకు సంబంధించి చేపడుతున్న ఈ చర్య కూడా బాలేదు అన్నది ఓ వాదన. ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఈ మేరకు ఓ పరిశీలన చేసి, సమావేశం అయి విద్యుత్ కష్టాలకు ఉన్న కారణాలేంటన్నది తేల్చింది.
ముందుగా కోల్ ఇండియా మేల్కోల్పు లేకపోవడం వలన చాలా వరకూ బొగ్గు కొరతకు సంబంధించి రాష్ట్రాలలో సమస్యలు వచ్చాయి. బొగ్గు కొనుగోలుకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిబంధనలు ఏవీ బాలేవు అన్నది కూడా ఓ వాదన ఉంది. ఆస్ట్రేలియా నుంచి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న నిబంధనను సడలిస్తే రాష్ట్రాలకు విద్యుత్ సంక్షోభం అన్నది తలెత్తదు. దేశీయ బొగ్గు ఉత్పాదకతపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. థర్మల్ పవర్ తో పాటు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటే ఫలితాలు ఉంటాయి. ఏదేమయినప్పటికీ కేంద్రం కారణంగానే విద్యుత్ సంబంధిత సమస్యలు వెలుగు చూస్తున్నాయని ఇంజినీర్స్ అసోసియేషన్ చెబుతున్న మాట.