ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. Project K రిలీజ్ డేట్ ఫిక్స్

0
116

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె హీరోయిన్​గా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్​ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా Project K రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ సినిమాను 2024 సంవత్సం…. సంక్రాంతి కానుకగా అంటే, జనవరి 12 వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు.