చంద్రబాబు ఇంటి వద్ద నిరసనలు…పెట్రోల్‌ డబ్బాలు తెచ్చుకోని !

-

చంద్రబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు నిరసనకు దిగారు. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Protests at Chandrababu’s house

ముఖ్యంగా తంబళ్లపల్లె టిక్కెట్ శంకర్ యాదవ్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు నాయకులు. తంబళ్లపల్లె టిక్కెట్ దక్కించుకున్న జయచంద్రా రెడ్డి… పెద్దిరెడ్డి బినామీ అంటూ నినాదాలు చేస్తున్నారు. కోవర్టులు వద్దంటూ స్లోగన్స్ చేస్తున్నారు. జై చంద్రబాబు.. జై లోకేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే…అనుచరుల నుంచి పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు…వారిని శాంతింపజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version