లైంగిక వేధింపుల కేసులో పంజాబ్ టీవీ పీటీసీ న్యూస్ ఛానెల్ ఎండీ రవీందర్ నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్ట్. మిస్ పంజాబ్ పోటీల పేరుతో యువతును లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాబ్ పోలీసులు రవీందర్ నారాయణ్ ను అరెస్ట్ చేశారు.
గత నెలలో ఇలా మిస్ పంజాబ్ కాంటెస్ట్ లో పాల్గొంటున్న ఓయువతి తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ ను పంజాబ్, హర్యాన హైకోర్ట్ లో దాఖలు చేశారు. సదరు ఛానెల్ నిర్వాహకుల కోరికలకు తన కూతురు ఒప్పుకోకపోవడంతో వేధిస్తున్నారని… రూ. 50 లక్షలు ఇస్తేనే పంపిస్తామంటూ బెదిరిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు పిటీషన్ దాఖలు చేసిన మార్చి 15న కోర్ట్ ఆదేశాలతో సదరు యువతిని పోలీసులు నిర్భందం నుంచి కాపాడాారు. మార్చి 17న యువతి మోహాలీ ఉమెన్ సెల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్ పంజాబ్ పోటీల్లో పాల్గొనేందుకు తాను వెళ్లానని.. నిర్వాహకులు నాతో పాటు కొంత మంది అమ్మాయిలను రహస్య గదికి పిలిచి అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీశారని…డైరెక్టర్ తో ఓ రాత్రి గడపాలంటూ ఒత్తడి తెచ్చారంటూ ఆరోపించింది. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసుకొని కేసును విచారిస్తున్నారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు.