ఖలిస్తాన్ సానుభూతిపరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

-

లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ అనే వ్యక్తిని ఓ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి నెలలో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమ మద్దతుదారుడు అమృత్ పాల్ కు లవ్ ప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు. దీంతో, తన స్నేహితుడి కోసం రంగంలోకి దిగాడు అమృత్ పాల్ సింగ్ . అమృత్ పాల్ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 24న అతడి మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు తీవ్ర భయానక పరిస్థితులు సృష్టించడంతో పోలీసులు నిస్సహాయులయ్యారు. చేసేదిలేక లవ్ ప్రీత్ సింగ్ ను వదిలేసారు పోలీసులు. అయితే, దీనివెనుక ఉన్న మాస్టర్ మైండ్ అమృత్ పాల్ సింగ్ ను మాత్రం ఈరోజు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.

Police arrest Khalistan supporter Amritpal Singh

లవ్ ప్రీత్ ను విడిపించుకునేందుకు యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై కొన్ని వారాల కిందటే అమృత్ పాల్ సింగ్ పై కేసు నమోదైంది. అయితే పంజాబ్ లో జీ-20 సన్నాహక సదస్సు జరుగుతున్నప్పుడు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూశారు. ఆ సదస్సు ముగియడంతో, పోలీసులు భారీ ఎత్తున వేట మొదలుపెట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో అమృత్ పాల్ సింగ్ పరారయ్యాడు. అయితే 100 కార్లతో అతడిని వెంటాడారు పోలీసులు. ఎక్కడిక్కడ జిల్లాల సరిహద్దులను మూసేశారు… చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఛేజింగ్ కొన్ని గంటల పాటు సాగింది. చివరికి అతడిని జలంధర్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి మద్దతుదారులు ఆరుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news