చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పంజాబ్ విజయం…

-

లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో ఘోర ఓటమి చవి చూసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్.. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) విధించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల తేడాతో 201 పరుగులు చేసి విజయం సాధించింది.19వ ఓవర్ ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లుగా వచ్చిన శిఖార్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్‌, శిఖార్ ధావన్ దూకుడుగానే ఆడారు. కానీ, ఐదో ఓవర్లో తుషార్ దేశ్ పాండే వేసిన రెండో బంతిని ఆడబోయి.. స్లిప్‌లో ఉన్న పతి రాణాకు చిక్కడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది.

CSK Vs Punjab XI | నాలుగు వికెట్ల తేడాతో చెన్నైపై పంజాబ్‌ విజయం.. !

శిఖార్ ధావన్ తర్వాత దూకుడుగా ఆడుతున్న ప్రభ్ సిమ్రాన్.. తొమ్మిదో ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన మూడో బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. అప్పటికి 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు ప్రభ్ సిమ్రాన్. 11 ఓవర్ లో రవీంద్ర జడేజా వేసిన రెండో బంతిని అథర్వ తైడే .. రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కూడా కోల్పోయింది. తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న లివింగ్ స్టోన్ 40 పరుగులకు ఔటయ్యాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన లివింగ్ స్టోన్.. ఐదో బంతిని రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక పంజాబ్ ఎలెవెన్ జట్టు బౌలర్లలో అర్ష్ దీప్, శామ్ కరణ్, రాహుల్ చాహర్, సికిందర్ రాజా ఒక్కో వికెట్ తీశారు. మ్యాచ్ పొడవునా అద్యంతం ఉత్కంఠ మధ్య చివరి ఓవర్ లో సికిందర్ రాజా ఎనిమిది పరుగులు సాధించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news