వెకిలి చేష్టలొద్దు.. వీడియో కాల్ లో మంత్రికి పుతిన్ వార్నింగ్

-

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దేశ డిప్యూటీ ప్రధాన మంత్రిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఒక దశలో సహనం కోల్పోయి మాట్లాడారు. వెకిలి చేష్టలు చేయొద్దని.. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండమని వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..?

ఇటీవల క్రెమ్లిన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రష్యాలోని సీనియర్‌ అధికారులు మంత్రులు పాల్గొన్నారు. దీనిలో ఉపప్రధాని, పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్‌ మంటురోవ్‌ కూడా పాల్గొన్నారు. రష్యా రక్షణ పరికరాల సరఫరాను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి పనితీరు మరీ నిదానంగా ఉందని పుతిన్‌ విమర్శించారు. ఈ విషయాలన్నీ క్రెమ్లిన్‌ పబ్లిష్‌ చేసిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో ఉన్నాయి.

క్రెమ్లిన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ మొదలైన తర్వాత డెనిస్‌ మాట్లాడుతూ.. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో హెలికాప్టర్ల ఇంజిన్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే సమయంలో పుతిన్‌ కలుగజేసుకొని.. ‘‘అందుకు చాలా సమయం ఉంది.. నేను అడిగేది ఈ పని ఎందుకు చేయలేదని..?’’ అంటూ గట్టిగా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news