క్వాడ్ దేశాల అధినేతల సమావేశం.. పాల్గొననున్న ప్రధాని మోదీ.

-

క్వాడ్ దేశాధినేతలు ఈరోజు సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్చువల్ గా సాగే ఈ మీటింగ్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రపంచ రాజకీయాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి క్వాడ్ దేశాధినేతలు చర్చించనున్నారు. 

ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో ముఖ్యమైన పరిణామాల గురించి దేశాధినేతలు చర్చించనున్నారు. ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో చైనాను అడ్డుకునేందుకు క్వాడ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా క్వాడ్ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం తటస్థంగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news