న్యూఢిల్లీ: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఇప్పటికే ప్రజా సమస్యలు, జగన్ హామీలపై 8 లేఖలు రాశారు. ఈ సారి నవ సూచనలతో పేరుతో తొమ్మిదో లేఖ రాశారు. ఏపీలో నడుస్తోన్న ఇసుక పాలసీపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. నిరాటంకంగా ఇసుక సరఫరా చేయాలని లేఖలో ప్రస్తావించారు. ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్‌కు అప్పగించాకే కొరత తీవ్రమైందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. రోజుకో రేటుకు ఇసుక అమ్ముతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ స్పందించి వెంటనే ఇసుక విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. కొందరు నాయకులు దళారీలుగా మారి డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.