కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఆదివారం కర్ణాటక ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ప్రచారంలో రాహుల్ గాంధీ ఫుడ్ డెలవరీ బాయ్ గా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరు లో రెండో రోజు తన మెగా రోడ్‌షోను పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ నేపథ్యంలో ఓ హోటల్‌కు చేరుకోవడానికి డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఎక్కి ప్రయాణించారు. ఆ క్రమంలో రాహుల్ డెలివరీ బాయ్ స్కూటర్‌పై దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో పలు రకాలుగా ప్రచారం చేస్తూ ప్రజలకు చేరవవుతున్నారు.
ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, అన్ని ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆదివారం బెళగావి సౌత్ నియోజకవర్గంలో మెగా రోడ్‌షో నిర్వహించారు. భారీ సంఖ్యలో బీజేపీ మద్దతుదారులు అమిత్ షా వాహనాన్ని చుట్టుముట్టి ఊరేగింపుకు వెళ్లారు. తనకు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రేక్షకులకు షా చేతులు ఊపుతూ అభివాదం చేశారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.