రేపటి లోగా మోడీ అతిపెద్ద కుంభకోణం బయటకొస్తుంది: రాహుల్ గాంధీ

-

ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాల వెల్లడి మీద సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ బట్టబయలు కానున్న నరేంద్ర మోడీ విరాళాల వ్యాపారం అని రాసుకొచ్చారు. 100 రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సొంత బ్యాంకు దాచిపెట్టి సుప్రీంకోర్టులో తలదించుకుందన్నారు అవినీతి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ బంధాన్ని బట్టబయలు చేయడం ద్వారా దేశం ముందు నరేంద్ర మోడీ అసలు ముఖం ని బహిర్గతం చేసే చరిత్రలో అతిపెద్ద కుంభకోణం గా రుజువు కాబోతోందని అన్నారు.

విరాళం ఇవ్వండి వ్యాపారం చేసుకోండి విరాళం ఇవ్వండి రక్షణ చేసుకోండి అనేది అందులో స్పష్టంగా దాగి ఉందని విరాళాలు ఇచ్చే వారి మీద వరాలు జల్లు కురిపించారని అన్నారు రాహుల్ గాంధీ సామాన్య ప్రజలపై పన్నుల భారం బిజెపి మోడీ ప్రభుత్వం ఇదే అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version