Breaking : విజయవంతంగా రాహుల్‌ 50 రోజుల యాత్ర

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర గురువారం నాటికి 50వ రోజు పాదయాత్రను తెలంగాణలో కొనసాగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి గురువారం ఉదయం మొదలైన ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా… 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ 26 కిలో మీటర్ల మేర నడిచారు. ఇదిలా ఉంటే… తమిళనాడులోని కక్యానకుమారిలో ప్రారంభమైన యాత్ర 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలో అడుగుపెట్టింది.

Rahul Gandhi Bharat Jodo Yatra is again on target Congress is plotting to  incite riots APMP|Rahul Gandhi की भारत जोड़ो यात्रा फिर निशाने पर, कांग्रेस  कर रही दंगे भड़काने की साजिश?

తమిళనాడు నుంచిమొదలైన యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటేసి తెలంగాణలోకి అడుగుపెట్టింది. మరోవైపు తెలంగాణలో రాహుల్ యాత్రకు ఊహించిన దాని కంటే అధిక స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రకు మక్తల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. నీటిలో దిగిన మత్స్యకారులు.. వీ ఆర్ ఆల్వేస్ విత్ యూ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని రాహుల్ కు స్వాగతం పలికారు.

 

Read more RELATED
Recommended to you

Latest news