మరోసారి హిందు, హిందుత్వవాది పదాలు రాజకీయంలోకి వచ్చాయి. తాజాగా జైపూర్ లో ద్రవ్యోల్భనంపై జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, హిందుత్వవాది పదాలపై పలు వ్యాఖ్యలు చేశారు. నేడు భారత రాజకీయాల్లో రెండు ప్రపంచాల మధ్య పోటీ ఉంది. ‘హిందూ’ మరియు ‘హిందుత్వవాది’. రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. నేను హిందువును కానీ హిందుత్వవాది కాదు… మహాత్మా గాంధీ హిందువని.. గాడ్సే హిందుత్వవాది అంటూ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వవాదులు తమ జీవితాంతం అధికారం కోసం ప్రయత్నిస్తుంటారని.. వారికి అధికారం తప్ప మరేది అవసరం లేదని అన్నారు.
హిందూ.. హిందుత్వవాదిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…
-