రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. ప్రభుత్వం ఇచ్చే తొలి ఆర్డర్ ఏమిటో తెలుసా..?

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భావి భారత ప్రధానిగా కొనియాడుతున్న నేత. సింప్లిసిటీలో ఆయన రూటే సపరేటు. దేశంలో విద్యార్థులు, యువతతో తరుచుగా సమావేశం అవుతుంటారు రాహుల్. దేశం, రాజకీయం, అభివ్రుద్దిపై యువతతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రధాని అయితే ప్రభుత్వ ఇచ్చే తొలి ఆర్డర్ ఏమిటో తెలుసా..? అయితే ఈ వార్త చదవాల్సిందే..

ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ దీపావళి  రోజున ’ప్రెండ్స్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్ మార్టిక్ హైయ్యర్ సెకండరీ స్కూల్‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారితో ముచ్చటించారు. ఇందులో ఒకరు మీరు ప్రధాని అయిన తర్వాత మీ ప్రభుత్వం తొలి ఆర్డర్ ఏమిటని ప్రశ్నించారు. అందుకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ..’ మహిళా రిజర్వేషన్లు‘ అని సమాధానం ఇచ్చారు. వారితో కలిసి ఛోలే బతురే విందు కూడా చేశారు రాహుల్ గాంధీ.