జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు రాజమౌళి ల కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎంత ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. పైగా తొలిసారి భారతదేశ చరిత్రలో ఆస్కార్ అవార్డును అందుకున్న తొలిచిత్రంగా రికార్డును సృష్టించింది. ఇందులో “నాటు నాటు” అనే పాటకు అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయం. కాగా ఈ పాట తెలుగు వెర్షన్ ను పాడింది మన తెలంగాణ తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. కాగా తాజాగా ఆస్కార్ అవార్డు రావడానికి ఒక కారణం అయిన రాహుల్ సిప్లిగంజ్ టాలెంట్ ను మెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
RRR సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు రూ. 10 లక్షల రివార్డ్ !
-