రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సులభంగా ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి..!

-

చాలా మంది ఎక్కువగా రైలు ప్రయాణాలను చేస్తూ వుంటారు. అయితే వారికి ఇది శుభవార్త. ఇకపై మీరు కదిలే ట్రైన్‌ లో నుండే వాట్సాప్ ద్వారానే ఫుడ్ ఆర్డర్ చెయ్యచ్చు. పూర్తి వివరాలను చూస్తే.. ఐఆర్‌సీటీసీ ఫుడ్ డెలివరీ సర్వీస్ జూప్ జియో హ్యాప్టిక్‌తో కలిసింది.

వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ద్వారా ఈజీగా ఆహారం ని ఆర్డర్ చేసేయచ్చు. పైగా ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. పైగా ఫుడ్ ఆర్డర్ ని ఇచ్చాక స్టేటస్ కూడా చెక్ చెయ్యచ్చు. ఇక ఫుడ్ ని ఎలా ఆర్డర్ చెయ్యాలనేది చూసేద్దాం.

దీని కోసం మొదట మీరు 7042062070 నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
ఇది జూప్ వాట్సాప్ చాట్ బాట్ నెంబర్. మొదట దీనికి హాయ్ అని మెసేజ్ చెయ్యండి.
పీఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. దాన్ని షేర్ చెయ్యండి.
మీ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సీటు నెంబర్, బెర్త్‌ను గుర్తిస్తుంది.
మీరు ఫుడ్ డెలివరీని నచ్చిన స్టేషన్ దగ్గర పొందొచ్చు.
నచ్చిన స్టేషన్, నచ్చిన రెస్టారెంట్ ని ఎంపిక చెయ్యచ్చు. యూపీఐ లేదా నెట్‌ బ్యాంకింగ్ ద్వారా పే చెయ్యాలి.

ఇలా మీరు నచ్చిన స్టేషన్, నచ్చిన రెస్టారెంట్ ని ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం ని ట్రైన్ లో తినచ్చు. ఫుడ్ విషయంలో ఇబ్బందులు కూడా వుండవు.

 

Read more RELATED
Recommended to you

Latest news