తెలంగాణ వాసులకు అలర్డ్‌.. భారీ వర్ష సూచన..

-

రాగల 24 గంటల్లో జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగ్లాదేశ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

GHMC issues rain alert in Hyderabad on Friday, alerts public

కాగా, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నాగర్‌ కర్నూల్‌, వనపర్తి మినహా అన్ని జిల్లాలో వర్షం కురిసినట్లు టీఎస్‌ డీపీఎస్‌ తెలిపింది. 20కిపైగా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాపాతం నమోదైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news