Breaking : ఏపీకి భారీ వర్ష సూచన..

-

గత కొన్ని రోజులుగా ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నందున మంగళవారం నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon reaches Andhra Pradesh on time, heavy rain in Rayalaseema, coastal  areas- The New Indian Express

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడలో 5.3, రావికమతంలో 4.6, రావికమతంలో 4.6 సెం.మీ. పెదకూరపాడు, మామిడికుదురు, బుక్కపట్నం, నూజివీడులో 4.4 సెం.మీ. వర్షం కురిసింది. ప్రజలు అవసరం ఉంటేనే ఇళ్లు విడిచి బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news