తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన..

-

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో అసని తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. అయితే.. అసని ఎఫెక్ట్.. తెలంగాణపై కూడా ఉండడంతో.. తెలంగాణాలో కూడా పలు చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి. అయితే.. తాజాగా.. హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వానలు కురిసే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

IMD cautions of rains in Telangana for next four days

కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 82 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెద్దబెల్లాల్‌ వడదెబ్బకు గురై ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు, అసని తుపాను కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలపై మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండుమూడు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకుపైగా తగ్గాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news