ఏపిని వరణుడు వదిలిపెట్టేలా లేదు. వరసగా వర్షాలలో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ ప్రజలు వరదల నుంచి కోలుకోవడం లేదు. తాజాగా మరోముప్పు ఏపీకి పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే చేదు నిజాన్ని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
ఎల్లుండి అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈనెల 28,29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఇప్పటికే బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఉందని తెలిపింది. నెలాఖరు వరకు దక్షిణ కోస్తాంద్రలో భారీ వర్షాలు కురువనున్నాయి. రేపు, ఎల్లుండి చిత్తూర్, నెల్లూర్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చిరిస్తోంది. పలు జిల్లాల్లో కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండని హెచ్చిరిస్తున్నారు.