సీఎం కేసీఆర్ రైతు దీక్ష..? ఈనెల 29న ఉండే అవకాశం..

-

రైతుల పక్షాన కేసీఆర్ దీక్ష చేయబోతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ప్రస్తుతం జరగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనెల29 దీక్షాదివాస్ రోజు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో కేంద్రంపై ఒత్తడి తెచ్చే విధంగా కేసీఆర్ దీక్షకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణలో యాసంగిలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవతున్నట్లు తెలుస్తోంది. దీక్షతో ఢిల్లీపై ఒత్తడి తీసుకురావడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దీనిపై నేడు జరుగుతున్న టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్రంలో వరి మంటల మధ్య బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చలికాచుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల ముందు దోషులుగా నిలబెట్టేందుకు ఇరు పార్టీల నాయకుల ప్రయత్నిస్తున్నారు. మీరంటే మీరే రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ రోజు ప్రెస్ మీట్లలో ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న ధర్నాలు, పర్యటనలు, టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు ప్రదర్శనలతో తెలంగాణ రాజకీయం వేడిగా ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version