రాజ్ తరుణ్, శేఖర్ బాషా.. నన్ను చంపాలని చూస్తున్నారు : లావణ్య

-

టాలీవుడ్ యంగ్ నటుడు రాజ్ తరుణ్, ఆయన మాజీ లవర్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ చాలా మంచివాడు.. ఆయన కాళ్లు మొక్కి తప్పయిందని క్షమాపణ చెబుతానంటూ లావణ్య గతంలో వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ తో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. కానీ ఆమె తరచూ ఓ విషయం వెల్లడిస్తూ ఈ వివాదానికి కామాలు పెడుతూ వెళ్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ కు చక్కర్లు కొడుతూ ఈ వ్యవహారంలో ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తోంది.

తాజాగా శనివారం రోజున నార్సింగి ఠాణాకు వెళ్లిన లావణ్య మరో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, శేఖర్ బాషా తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించింది. ప్రాణభయంతో బతుకుతున్నానని.. తనను కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక శుక్రవారం రోజున ఇదే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 15 మందితో కలిసి తన ఇంటికి వచ్చి వాళ్లు తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news