Rajamouli: అంత ఖరీదైన కారు రాజమౌళి సొంతం..దాని విలువ ఎంతో తెలుసా?

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR గత నెల 25న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్ర విజయాన్ని ప్రస్తుతం దర్శకధీరుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన RRR పిక్చర్ ప్రేక్షకులను అంచనాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ కలిసి నటించారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చింది ఈ పిక్చర్. ఇక ఇందులో రామ్ చరణ్, తారక్ ఇద్దరి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 30 శాతం వాటా తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
ఈ సంగతులు పక్కనబెడితే..రాజమౌళి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇంతకీ సదరు ఫొటోలో రాజమౌళి ఏం చేస్తున్నాడంటే..

కొత్త కారును రాజమౌళి కొనుగోలు చేయగా, అది చూసి సినీ అభిమానులు ‘వావ్’ అంటున్నారు. వోల్వో ఎక్స్ సి 40 కారును మాస్టర్ స్టోరి టెల్లర్ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో వోల్వో కార్స్ ప్రతినిధి కారు తాళాలను రాజమౌళికి అందించారు. ఈ ఫొటోను వోల్వో కార్స్ వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.

ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘పర్ఫెక్ట్ కార్..ఫర్ పర్ఫెక్ట్ పర్సన్, ఎపిక్ కార్, గ్రేట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. కారు ఖరీదు రూ.45 లక్షలు అని సమాచారం. రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కె.ఎల్.నారాయణ ఆ సినిమాకు ప్రొడ్యూసర్.

https://www.instagram.com/p/Cck0-1gBe3V/?utm_source=ig_embed&ig_rid=6e6f9e4f-de2e-4350-9172-87262d3949f6

Read more RELATED
Recommended to you

Latest news