కోట్లు దండుకుంటున్నారని… గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ..

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలో రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రైవేటు వైద్య క‌ళాశాల‌లు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగ‌స్వామ్యం కావ‌డం దారుణమన్నారు. మంత్రులు పువ్వాడ అజ‌య్‌కుమార్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర రెడ్డిలు సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారని ఆయన వెల్లడించారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని ఏటా వంద కోట్ల మేర సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

Bihari bureaucrats helping KCR loot Telangana, alleges Congress leader Revanth  Reddy- The New Indian Express

రాష్ట్రంలోని ప్రైవేటు క‌ళాశాల‌ల్లో సీట్ల కోసం దర‌ఖాస్తు చేయించ‌డం, సీట్ల కేటాయింపు చేయ‌డం కౌన్సిలింగ్ పూర్తయ్యిన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇత‌రుల‌కు రెండు నుంచి రెండున్నర‌ కోట్లకు అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు. క‌న్వీన‌ర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని, బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను రేవంత్ రెడ్డి కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news