కొత్త కెప్టెన్ చాహల్ అని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్వీట్.. అంతలోనే ట్విస్ట్

-

ఐపీఎల్ 2022 కోసం అన్ని ఫ్రాచైంజీలు సిద్ధం అవుతున్నాయి. త‌మ జ‌ట్టుకు కెప్టెన్ ల‌ను, జెర్సీల‌ను ఫైన‌ల్ చేసుకుంటు బిజీగా ఉన్నాయి. తాజా గా నేడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా నుంచి వ‌చ్చిన ట్విట్స్ సంచ‌ల‌నాలు రేపాయి. త‌మ జ‌ట్టుకు కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహ‌ల్ అంటూ ట్విట్ వ‌చ్చింది. కాక ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న సంజూ శాంస‌న్ ను తొల‌గిస్తున్న‌ట్టు ట్వీట్ చేసింది. అయితే ఇక్క‌డే అస‌లు ట్వీస్ట్ ఉంది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాను చాహ‌ల్ హ్య‌క్ చేశాడు. ఈ విషయాన్ని తానే ప్ర‌క‌టించాడు. రాజ‌స్థాన్ ట్విట్ట‌ర్ ఖాతాతో కాసేపు అల్ల‌రి కూడా చేశాడు. ఒక ఫోటో పెట్టి ఈ ట్వీట్ కు 10 వేల రీ ట్వీట్స్ వ‌స్తే.. బ‌ట్ల‌ర్ అంకుల్ తో క‌లిసి బ్యాటింగ్ ఓపెన్ చేస్తా అని ట్వీట్ చేశాడు. అలాగే స్పిన్న‌ర్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తు చిలిపి ట్వీట్ చేశాడు. త‌న‌కు పాస్ వ‌ర్డ్ చెప్పిన వ్య‌క్తికి కూడా థాంక్స్ చెప్పాడు.

కాగ రాజ‌స్థాన్ అధికారిక ఖాతాతో అల్లరి చేసిన ట్వీట్స్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగ కొద్ది సేప‌టి త‌ర్వాత‌.. త‌మ అకౌంట్ ను హ్యాక్ చేశార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ట్వీట్స్ ను ఇగ్నోర్ చేయాల‌ని రాజ‌స్థాన్ యాజ‌మాన్యం కోరింది. కాగ త‌మ ట్విట్ట‌ర్ ను చాహ‌ల్ హ్య‌క్ చేశాడ‌ని కూడా ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version