నటుడు మైల్ సామి మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రజినీకాంత్.. క్షమించమని అడగాలంటూ..

-

తమిళ నటుడు మైల్ సామి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయన ఆరోగ్యం క్షేనించటంతో చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై స్పందించారు సూపర్స్టార్ రజనీకాంత్..ప్రముఖ తమిళనాడు మైల్ సామి 57 ఏళ్ల వయసులో కొన్ని అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఈ విషయంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. అతని మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని రోజుల క్రితం మైల్ సామి తనకు ఫోన్ చేశారని కానీ లిఫ్ట్ చేయలేకపోయాను అని తెలిపారు. ఆ విషయానికి ఇప్పుడు చింతిస్తున్నానని అతని చివరి కోరిక తప్పకుండా నెరవేస్తానని అన్నారు..

రజనీకాంత్ మైల్ సామి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటినుంచో ఉన్న స్నేహితుల్లో మైల్ సామి కూడా ఒకరని దాదాపు 24 ఏళ్ల నుంచి అతను తెలుసు అంటూ చెప్పకువచ్చారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారని ఆ తర్వాత నటుడుగా ఎదిగారని చెప్పుకొచ్చారు. తామిద్దరం ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే ఎక్కువ సినిమాలు మాత్రం కలిసి నటించలేకపోయామని చెప్పారు. సామి ప్రతి ఏట కార్తీక దీపం కోసం తిరువణ్ణామలై వెళ్లేవాడని.. అక్కడి జనాలను చూసి తన సినిమా ఫస్ట్ షోకు అంత మంది జనం వచ్చినట్లుగా ఆనందపడేవాడని గుర్తుచేసుకున్నారు. అలాగే కార్తీక దీపం సందర్భంగా తనకు కాల్ చేసి విషెస్ తెలిపేవాడని కానీ చివరిసారి కాల్ చేసినప్పుడు పనిలో ఉండి తన లిఫ్ట్ చేయలేక పోయినట్లు తెలిపారు. నా కోసం మూడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేకపోయానని అన్నిసార్లు ఫోన్ చేశాడని తెలుసుకొని సారీ చెప్పాలనుకొని మరిచిపోయానని అందుకు ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నానని తెలిపారు..

వివేక్, మైల్ సామిలతో కలిసి నటించిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని వీరిద్దరి మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు చెప్పుకొచ్చారు. అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులకే కాకుండా యావత్ మానవాళికి కూడా ఇది ఎంతో బాధను కలిగిస్తుందని తెలిపారు. వారిద్దరూ ఎంతో సామాజిక ఆలోచనపరులని సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులంటూ చెప్పకు వచ్చారు శివరాత్రి రోజే మైల్ సామి చనిపోవడం ఆ దేవుని ప్రణాళిక ఏనని.. తన అభిమాన భక్తుడిని ఆ దేవుడు తీసుకుపోయాడు అంటూ చెప్పుకొచ్చారు.. తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శించాలన్న మైల్‌ సామి కోరికను నెరవేరుస్తానని రజనీ కాంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news