పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ, లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దారుణ హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల రాజ్య సభ సంతాపం తెలియజేసింది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ నుంచి తనని మరోసారి రాజ్యసభ సభ్యున్ని చేసిన సీఎం జగన్, వైయస్ భారతమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇకపై తన బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వహిస్తారని తెలిపారు. అయితే పునఃవ్యవస్థీకరించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో విజయసాయి రెడ్డికి చోటు కల్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేసి తెలిపారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో తనకు అవకాశం దొరకడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు ప్యానెల్ లో చోటు దక్కించుకున్న ఇతర సభ్యులకూ అభినందనలు తెలియజేశారు.
పునఃవ్యవస్థీకరించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్లో నాకు అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌ను ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు పునఃవ్యవస్థీకరించారు. నాతో పాటు ప్యానల్లో చోటు దక్కించుకున్న ఇతర సభ్యులకు నా శుభాభినందనలు. pic.twitter.com/IfS3c2gJEe
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2022