మంచు మనోజ్ కి రామ్ చరణ్ – ఉపాసన సర్ ప్రైజ్ గిఫ్ట్

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మంచు కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేంత గొడవలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఇండస్ట్రీలో వాళ్లందరికీ తెలిసిన విషయం ఏంటంటే.. ఈ రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా, ఒకే కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి ఉంటారని తెలుసు. ఇక మంచు విష్ణు సంగతి కాసేపు పక్కన పెడితే.. మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇద్దరూ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటారు.

ఇక తాజాగా మంచు మనోజ్ భూమా మౌనికని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకి రామ్ చరణ్ – ఉపాసన దంపతులు సర్ ప్రైస్ గిఫ్ట్ లు పంపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు మంచు మనోజ్. వారు పంపిన బహుమతులను షేర్ చేసిన మంచు మనోజ్.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version