శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

-

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో జరిగిన ఒక సంఘటన గురించి కంబ రామాయణంలో ఉన్న అంశం ద్వారా ఈ విశేషాన్ని తెలుసుకుందాం…

 

శ్రీరాముడు లంక కు వెళ్ళటానికి రామ సేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు సముద్రంలో రాళ్లు వేస్తున్నారు. అవి తెలుతున్నాయి. ఇదంతా చూస్తూ శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్రంలో రాయిని వదిలాడు. విచిత్రంగా ఆ రాయి మునిగి పోయింది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది. ఇదేంటి! వానరులు వేస్తే తేలుతున్నాయి.

నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దాం అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయిందట. ఇదేంటని శ్రీరాముడు హనుమను మరి కొందరిని అడిగాడు. స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం. మీరు రాయలేదు కదా అన్నారు. అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా. నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవటం ఏమిటి? ఎందుకలా? అన్నారు స్వామి.

అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు. స్వామి! మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతోంది స్వామి అని. అందుకే…….
రామ నామాన్ని జపించండి. ధర్మంగా జీవించండి. రామనామం మహాశక్తివంతం అని తులసీదాస్‌, రామదాసు వంటి ఎందరోమహానుభావులు నిరూపించారు. శ్రీ రామ జయరామ జయజయ రామ.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news