రాంగోపాల్ వర్మ “డేంజరస్” చిత్రం విడుదల తేదీ ఖరారు

-

కంపెనీ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ” డేంజరస్”. మా ఇష్టం అన్నది ఉప శీర్షిక. ఈ చిత్రంలో అందాల తారలు నైనా గంగూలి, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా.. ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. అయితే గతంలోనే విడుదల కావలసిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు.

లెస్బియన్ సబ్జెక్టు మూలాన చాలా థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా విడుదలను గతంలో వాయిదా వేశారు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు రాంగోపాల్ వర్మ. మరి ఈసారైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ చిత్రం విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version