రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బిజెపి – మధుయాష్కి గౌడ్

-

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేసిందే బిజెపి పార్టీ అని ఆరోపించారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. 2013లో పదివేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. ఇప్పుడేదో బిజెపి చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే టిఆర్ఎస్ గొడవ చేస్తుందని, ఢిల్లీకి వెళ్లినప్పుడు మాత్రం మోడీ కాళ్ల మీద పడి వస్తాడని ఎద్దేవా చేశారు.

ఇక్కడికి ప్రధాని వస్తున్నాడు అంటే నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే టిఆర్ఎస్, బిజెపి ఈ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్లు ఉందన్నారు మధుయాష్కి గౌడ్. గవర్నర్ కి అనుమానం ఉంటే హోం శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ చేస్తున్నది నిజమేనన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు సైతం టాప్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ లిక్కర్ పాలసీపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారుు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణలోనే అవుతుందన్నారు. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు మధుయాష్కి గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version