గెస్ట్ రోల్ చేస్తున్న రానా.. ఆ డైరెక్ట‌ర్ కోస‌మే

-

సినిమాల్లో గెస్ట్ రోల్ అనేది సాధార‌ణం. అది సినిమాకు మ‌రింత హైప్ తీసుకొస్తుంది. కాన గెస్ట్ రోల్ అనేది కొన్ని సినిమాల్లోనే క‌నిపిస్తుంది. కార‌ణం ఆ హీరోల మ‌ధ్య ఉన్న స‌న్నిహితం. ఇక బాహుబ‌లితో రానా ఎంత ఫేమ‌స్ అయ్యాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు కూడా విభిన్నంగా ఉండ‌టంతో విప‌రీతంగా క్రేజ్ వ‌స్తోంది. ఇప్పుడు రానా మ‌రో హీరో కోసం గెస్ట్ రోల్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఆయ‌నెవ‌రో కాదండోయ్‌. మ‌న హీరో గోపిచంద్‌.

క్రేజీ డైరెక్ట్ తేజతో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమాను చేస్తున్నాడు గోపీచంద్‌. అయితే ఈ సినిమాలో మంచి క్రేజ్ ఉన్న గెస్ట్ రోల్ ఉందంట‌. దీని కోసం ఎవ‌రిని తీసుకోవాల‌ని మ‌ద‌న‌ప‌డుతుంటే.. తేజ త‌న‌కు రానాతో ఉన్న మంచి సంబంధాల కారణంగా రానాను ఒప్పించాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ క‌లిసి నేనేరాజు నేనే మంత్రి అనే సినిమా చేయ‌డం ఇందుకు కార‌ణం. పాత్ర‌కు కూడా మంచి ప్రాముఖ్య‌త ఉండ‌టంతో రానా ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇక ఈ మూవీని జూన్ నుంచి సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ఇద్ద‌రి అభిమానులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version