బీహార్ లో దారుణం.. చిన్నారిపై తాత వరసయ్యే వ్యక్తి అత్యాచారం.

రోజురోజుకు కామాంధుల దారుణాలు ఎక్కువైపోతున్నాయి. వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు కామాంధులు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. వరసకు తాతయ్యే 60 ఏళ్ల వృద్ధుడు మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

rape

పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని హాజీపూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత చిన్నారికి తాత వరసయ్యే వినోద్ భగత్(60) అలియాస్ వినోద్ భండారీ సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ నివాసి. తన మేనకోడలు వివాహానికి హాజీపూర్ వచ్చాడు. అయితే చిన్నారిపై కన్నేెసిన వినోద్ భగత్ టెర్రస్ పై చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాాచార బాధితురాలు వినోద్ పెద్ద మేనకోడలి కుమార్తె. గాయాలపాలైన బాలికను చూసి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు పెట్టి వినోద్ భగత్ ను అరెస్ట్ చేశారు. కాగా అత్యాచారానికి గురైన బాలిక వైద్య ఖర్చులన్నీ భరించేందుకు సదరు నిందితుడు ముందుకురాగా..కుటుంబ సభ్యులు విషయాన్ని దాచేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. గాయపడిన చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.